Home  »  TV News  »  తండ్రి కాబోతున్న అవినాష్

Updated : Jul 9, 2023

జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ గురించి చెప్పాల్సిన అవసరం లేకుండానే ప్రతీ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కనిపిస్తూ పెద పాలేరులా అలరిస్తూ ఉంటాడు. అలాంటి అవినాష్ ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. జబర్దస్త్ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో అవినాష్ ఒకరు. జబర్దస్త్ క్రేజ్ తో అతనికి  బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే  అవకాశం లభించింది. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఇచ్చి తన జోకులతో అందరిని ఎంటర్టైన్ చేసాడు. తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చాక అనుజా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక తాను  తండ్రి కాబోతున్నానంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనౌన్స్ చేసాడు. ఇప్పుడు అనుజాకు నాలుగో నెల నడుస్తోందని చెప్పాడు. ఈ విషయాన్నీ తన  పేరెంట్స్ కి తన అత్తామామకు కూడా చెప్పడంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారన్నారు. 

ఇకపోతే అమ్మాయా, అబ్బాయా అంటూ ఎవరికి ఎక్స్పెక్ట్ చేయడం లేదు అని చెప్పారు. ఇక ఇద్దరూ ఒకరికి ఒకరు ముద్దులు పెట్టేసుకుని తమ ప్రేమను ఈ వీడియోలో చూపించేసుకున్నారు. బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్ మాత్రమే తింటూ హ్యాపీగా ఉండాలి అంటూ తన వైఫ్ కి స్వీట్ సజెషన్స్ కూడా ఇచ్చాడు. తండ్రికి అర్ధం తాను తండ్రి అయ్యేంతవరకు తెలీలేదని ఇప్పుడు తాను చాలా హ్యాపీగా ఉన్నానని నైట్ నిద్రపోయేటప్పుడు తన బేబీ స్కాన్ రిపోర్ట్స్ చూసుకుని మరీ పడుకుంటానని చెప్పాడు అవినాష్. తన బేబీ హార్ట్ బీట్ వినడం చాలా హ్యాపీగా ఉందన్నాడు.  ఇక ఇంట్లో తన వైఫ్ కి ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటాను అని...నెటిజన్స్ కి కూడా అలా ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే హెల్ప్ చేయమని సలహా ఇచ్చారు. మీరంతా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలాగే ఏం తినాలి ఎలా ఉండాలో తన వైఫ్ కి అవసరమైనన్ని టిప్స్ కూడా ఇస్తూ ఉండమని కోరారు అవినాష్ అండ్ అనుజా.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.